మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఈ మూవీలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో డార్లింగ్ పాత్ర ఎలా ఉంటుందని ఓ అభిమాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు విష్ణు రిప్లై ఇచ్చాడు. ప్రభాస్ పాత్ర అందరినీ నచ్చేలా ఉంటుందని హామీ ఇచ్చాడు. కాగా, ఈ సినిమా 2025 ఏప్రిల్ 25న విడుదల కానుంది.