అక్కినేని నాగచైతన్య, నటి శ్రీలీల జంటగా నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు కార్తీక్ దండుతో చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల కనిపించనున్నట్లు సమాచారం. ‘తండేల్’ రిలీజ్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అలాగే శ్రీలీల అక్కినేని అఖిల్‌తో కూడా సినిమా చేయబోతుందట.