మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఇప్పటికే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ మూవీలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.