గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ టీమ్ నుంచి అప్డేట్ వచ్చింది. రామ్ చరణ్ ఫొటోతో ప్రపంచంలోనే అతిపెద్ద కటౌట్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈనెల 29న విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది.