అక్కినేని ఫ్యామిలీలో మరికొన్ని గంటల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య.. ఇవాళ రాత్రి 8:13 గంటల ముహూర్తానికి ధూళిపాళ్ల శోభిత మెడలో 3 ముళ్లు వేయనున్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలోని ఈ వేడుక అతికొద్ది మంది సన్నిహితుల మధ్య జరగనుంది. టాలీవుడ్ నుంచి కూడా మెగా, దగ్గుబాటి కుటుంబాలు రాబోతున్నాయి. రాజమౌళి, మహేష్, ప్రభాస్ తదితర స్టార్ హీరోలు కూడా విచ్చేయనున్నారు.