దర్శకులపై నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రశంసల వర్షం కురిపించారు. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్‌లు మహిళలను ఎంతో గౌరవిస్తారని చెప్పారు. గీతాంజలి, శ్రీవల్లి పాత్రలు చాలా బలమైనవని, అలాంటి పాత్రలను తెరపై చూపాలంటే ధైర్యం కావాలని అన్నారు. కాగా, రష్మిక.. సందీప్ రెడ్డితో ‘యానిమల్’, సుకుమార్‌తో ‘పుష్ప 1,2’ సినిమాలు చేశారు.