జర్నలిస్ట్‌పై దాడి కేసులో నటుడు మోహన్ బాబు స్టేట్మెంట్ తీసుకోలేదని పోలీసులు తెలిపారు. వారి కుటుంబసభ్యులు మాత్రమే అందుబాటులోకి వచ్చారని చెప్పారు. మోహన్ బాబు ఎక్కడున్నారో సమాచారం లేదని వెల్లడించారు. అయితే ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా.. తాను పరారీలో లేనని, త్వరలో అందుబాటులోకి వస్తానని నిన్న మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఆయన గన్ను సీజ్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.