హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘క’. ఈ మూవీని సుజీత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. అయితే నిన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామని చిత్రబృందం తెలిపింది. కానీ విడుదల చేయలేదు. దీనిపై మేకర్స్ మరోసారి వివరణ ఇచ్చారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ‘క’ ట్రైలర్ విడుదల వాయిదా పడిందని.. క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు. నేడు 10 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా తెలియజేశారు.