ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన యువతికి అల్లు అర్జున్, సుకుమార్ అండగా నిలిచారని ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత తెలిపారు. ఈ విషయం బయటకు వచ్చాక తమ చిత్రాల్లో ఆమెకు అవకాశమిస్తామని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. అలాగే బాధితులందరికీ కూడా బన్నీ, సుకుమార్ అండగా నిలవాలని కోరారు. ఇప్పుడు తాను, తన పిల్లలు కూడా బాధితులమే అని.. తమకు కూడా అల్లు అర్జున్ సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.