US Grants Ukraine $500 Million In Extra Military Aid: Pentagon
Ukraine: అగ్రరాజ్యం అమెరికా ఉక్రెయిన్‌కు (Ukraine) భారీ సాయాన్ని ప్రకటించింది. సైనిక సాయంగా 500 మిలియన్ డాలర్లను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం పెంటగాన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా యుద్ధం ప్రకటించి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఉక్రెయిన్‌కు (Ukraine) తొలి నుంచి అమెరికా అండగా ఉంది. తాజాగా మరో 500 మిలియన్ అమెరికన్ డాలర్లను ప్రకటించింది. అమెరికా అందిస్తోన్న సైనిక సాయంలో ఫైటింగ్ వెహికిల్స్, స్ట్రైకర్ ఆర్మ్డ్ పర్సనల్ క్యారియర్స్, ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్, ఆయుధాలు, గ్రౌండ్ వెహికిల్స్ ఉంటాయి. ఉక్రెయిన్ సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అత్యాధునిక సైనిక సామాగ్రిని పంపిస్తోంది.
రష్యా దూకుడు తగ్గించేందుకు అమెరికా సహా ఇతర దేశాలు కూడా ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ (Ukraine) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలోపేతం చేసేందుకు అమెరికా హెల్ప్ చేస్తోంది. తమకు మరో 500 మిలియన్ డాలర్ల సైనిక సామాగ్రిని అమెరికా పంపించడం పట్ల ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. అగ్రరాజ్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేయడంపై రష్యా స్పందించింది. అమెరికాలో గల రష్యా ఎంబసీ టెలిగ్రామ్ యాప్‌లో స్పందిస్తూ.. రష్యాపై వ్యూహాత్మక ఓటమిని కలిగించే ఆలోచనతో వాషింగ్టన్ ఇలా చేస్తోందని పేర్కొంది. అమెరికా చర్యలను ఖండించింది.