రష్యాపై ఉక్రెయిన్ (Ukraine) దాడులు భీకరంగా సాగుతున్నాయి. తాజాగా నల్లసముద్రంలో రష్యాకు చెందిన పోర్టు నోవోరోసిస్క్పై ఓ సముద్ర డ్రోన్ దాడి చేసింది. ఈ ఓడరేవు (Port) రష్యా ఎగుమతులకు అత్యంత కీలకమైంది. దీంతో ఈ పోర్టులో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక్కడ చమురు టర్మినల్‌ను నిర్వహించే కాస్పియన్ పైప్‌లైన్ (Caspian Pipeline) కన్సార్టియం ఈ విషయాన్ని వెల్లడించింది.తమ ఆహార ఉత్పత్తుల కేంద్రాలపై దాడులు చేస్తూ పొట్టకొట్టాలనుకుంటున్న పుతిన్(Putin)కు జెలెన్స్కీ ఆర్మీ గట్టిగా సమాధానమిస్తోంది. ఈ ఓడరేవు రష్యా ఎగుమతులకు అత్యంత కీలకమైంది. దీంతో ఈ పోర్టులో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక్కడ చమురు టర్మినల్‌ను నిర్వహించే కాస్పియన్ పైప్‌లైన్ కన్సార్టియం ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇక్కడి నుంచి కాస్పియన్ పైప్‌లైన్ కన్సార్టియం చమురును ట్యాంకర్లలో నింపుతుంటుంది. తాజాగా ఆ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. పౌర నౌకలకు రక్షణగా వెళుతున్న సైనిక ఓడలపై దాడులు జరిగినట్లు రష్యా (Russia) ప్రభుత్వం పేర్కొంది. ఈ దాడిని తాము తిప్పికొట్టామని వెల్లడించింది. తమ నౌక ఆ డ్రోన్‌ను పేల్చివేసిందని చెప్పింది. గత నెల నల్లసముద్రపు ధాన్యం ఒప్పందం నుంచి రష్యా వైదొలగిన నాటి నుంచి ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని మూడు ప్రధాన పోర్టులపై రష్యా ఎడతెరిపిలేకుండా దాడులు చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా క్రిమియాపైకి వచ్చిన 10 డ్రోన్లను తాము కూల్చేసినట్లు రష్యా తెలిపింది. ‘‘క్రిమియా(Crimea)లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పలు ఆపదలను ధ్వంసం చేసింది’’ అని క్రిమియా ప్రతినిధి ఓల్గె క్రూచ్కోవ్ వెల్లడించారు.