పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ని చంపేందుకు ప్రయత్నించారు. ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపారు. ఇమ్రాన్ ఉన్న వాహనం దగ్గరే కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా నలుగురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కూడా గాయపడ్డారు. ఆయనతో పాటు మరో నలుగురికి గాయాలైనట్టు సమాచారం. ఈ కేసులో ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదే సమయంలో, ఇమ్రాన్ ఖాన్ సమీపంలోని ఆస్పత్రిలో చేరారు. అయితే ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ మీడియా కథనం ప్రకారం, వజీరాబాద్‌లోని జాఫర్ అలీ ఖాన్ చౌక్ సమీపంలో మాజీ ప్రధాని ,పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఉన్న సమీపంలో కాల్పులు జరిగినట్లు రిపోర్ట్ చేస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ బుల్లెట్ గాయాల కారణంగా గాయపడ్డాడు. అతని కుడి కాలికి బుల్లెట్ గాయం కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. ఈ కాల్పుల్లో ఆయనతో పాటు పలువురు పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేతలు కూడా గాయపడ్డారు.