»6 2 Earthquake In North West China 111 People Dead
China:లో భూకంపం..111 మంది మృతి
వాయువ్య చైనాలో సోమవారం అర్ధరాత్రి 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 111 మంది మరణించగా..మరో 200 మందికిపైగా గాయపడినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.
6.2 Earthquake in north west China 111 people dead
వాయువ్య చైనా(china)లోని గన్సు, కింగ్హై ప్రావిన్సులలో సోమవారం రాత్రి 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా నివేదిక ప్రకారం భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 111 దాటింది. నివేదిక ప్రకారం బలమైన భూకంపం కారణంగా గన్సు, కింగ్హై ప్రావిన్సులలో 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో పొరుగు ప్రావిన్స్ కింగ్‌హైలోని హైడాంగ్ నగరంలో తొమ్మిది మంది మరణించగా.. 124 మంది గాయపడ్డారు. భూకంపానికి సంబంధించి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు చైనా అధికారిక వార్తా మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదించింది. అధ్యక్షుడి ఆదేశానుసారం, బాధిత ప్రజలకు సరైన పునరావాసం కల్పించడం, ప్రజలను సురక్షితంగా రక్షించడం, పెద్ద ఎత్తున రెస్క్యూ కార్యకలాపాలు చేయడం ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.
బలమైన భూకంపం కారణంగా అనేక ఇళ్లు కూలిపోయాయని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. దీంతోపాటు పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. భూకంపం సంభవించిన వెంటనే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోకి పరుగులు తీశారు. సోమవారం చైనాలోని గన్సు మరియు కింగ్హై ప్రావిన్స్‌లలో సంభవించిన బలమైన భూకంపం తరువాత, మంగళవారం (డిసెంబర్ 19) తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి.
#UPDATE: Video captured the moment when a 6.2-magnitude earthquake shook Linxia Hui Autonomous Prefecture in NW China’s Gansu on Monday night. The quake can be felt in major cities like Xi’an and Chengdu. pic.twitter.com/CrDeQBbnyO
భూకంప తీవ్రతను యుఎస్ జియోలాజికల్ సర్వే 5.9గా, జిన్హువా 6.2గా అంచనా వేసింది. క్వింఘై ప్రావిన్స్‌తో సరిహద్దుకు సమీపంలో ఉన్న గన్సు ప్రావిన్స్‌లో భూకంపం కారణంగా కొన్ని స్థానిక గ్రామాలలో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని నివేదికలు తెలిపాయి. ఇది కాకుండా, పడిపోయిన ఇళ్ల పైకప్పులు, ఇతర శిధిలాలు కూడా ఉన్నాయి. USGS ప్రకారం భూకంపం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:59 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. మొదట్లో 6.2 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం సంభవించిన వెంటనే అధికారులు అత్యవసర ప్రతిస్పందనను ప్రారంభించారు. భూకంప ప్రభావిత ప్రాంతానికి సహాయక సిబ్బందిని పంపినట్లు జిన్హువా నివేదించింది.