»30 Years Man Sold Paintings In The Museum To Pay Off His Debts Germany
Pay off his debts: అప్పులు తీర్చేందుకు మ్యూజియంలో పెయింటింగ్స్ అమ్మేశాడు..కానీ చివరకు
ఓ వ్యక్తి తన అప్పులన్నీ తీర్చుకుని కాస్లీగా జీవించాలని అనుకున్నాడు. అందుకోసం ఏకంగా భారీ ప్లాన్ వేశాడు. తాను పనిచేసే మ్యూజియంలో విలువైన పెయింటింగ్స్ అమ్మేశాడు. కానీ చివరకు పోలీసులకు బుక్కయ్యాడు.
సాధారణ జీవితం గడిపే ఓ వ్యక్తి అప్పులు తీర్చుకుని అత్యంత విలాసవంతంగా జీవించాలని అనుకున్నాడు. ఆ క్రమంలో ఎలా అని ఆలోచిస్తు అతను పనిచేసే మ్యూజియంలో ఉండే పెయింటింగ్స్ అమ్మాలని భావిస్తాడు. ఆ నేపథ్యంలోనే మూడు విలువైన పెయింటింగ్స్ దొంగిలించి వాటి స్థానంలో నకిలీవి పెడతాడు. అవి తన తాతల నాటివని పేర్కొంటూ అసలు వాటిని విక్రయించాడు. అంతేకాదు తన అప్పులన్నీ తీర్చుకుని విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్నాడు. ఈ సంఘటన జర్మనీలో చోటుచేసుకుంది.
ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న అక్కడి అధికారులు అనుమానంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..అసలు విషయం ఒప్పుకున్నాడు. మ్యూనిచ్‌లోని డ్యుచెస్ మ్యూజియంలో పనిచేసిన 30 ఏళ్ల వ్యక్తి ఈ పని చేసినట్లు అధికారులు తెలిపారు. అతను మే 2016 నుంచి ఏప్రిల్ 2018 వరకు మ్యూజియంలో పనిచేశారు. అతను మొదట ఫ్రాంజ్ వాన్ స్టక్ అనే “దాస్ మార్చెన్ వోమ్ ఫ్రోష్కోనిగ్” (ది టేల్ ఆఫ్ ది ఫ్రాగ్ ప్రిన్స్) పెయింటింగ్ దొంగిలించాడు. దాని స్థానంలో ఒక నకిలీని ఉంచాడు. తర్వాత అతను దానిని స్విస్ గ్యాలరీకి $74,000కి వేలం వేసి దాదాపు $52,000 నగదును స్వీకరించాడు. ఇంకో పెయింటింగ్ ఇమ్ గెబిర్గేను సేల్ చేసి $12,184 అందుకున్నాడు. అయితే మూడు చోరీ చేయగా..రెండు మాత్రమే అమ్ముకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే నిందితుడు తన తప్పును ఒప్పుకోవడంతో అతనికి పెయింటింగ్‌లను దొంగిలించిన డ్యుచెస్ మ్యూజియంకు $64,200 కంటే ఎక్కువ తిరిగి చెల్లించాలని మ్యూనిచ్ జిల్లా కోర్టు ఆదేశించింది. దీంతోపాటు అతనిపై 21 నెలల సస్పెన్షన్‌ను విధించింది. అంటే అతను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు.