»Keep These Things In Mind While Cooking In Clay Pot
Clay Pot : మట్టి కుండలో వంట చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
Clay Pot : ఈ రోజుల్లో చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ అయ్యిందనే చెప్పొచ్చు. దీనిలో భాగంగానే మళ్లీ... పాత పద్దతులను ఉపయోగించడం మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలో మట్టి కుండల్లో వంట చేయడం, ముఖ్యంగా బిర్యానీ, చికెన్ లాంటివి వండుతున్నారు. మట్టి కుండలో వంట చేయడం నిజానికి చాలా ఆరోగ్యకరం.
ఈ రోజుల్లో చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ అయ్యిందనే చెప్పొచ్చు. దీనిలో భాగంగానే మళ్లీ… పాత పద్దతులను ఉపయోగించడం మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలో మట్టి కుండల్లో వంట చేయడం, ముఖ్యంగా బిర్యానీ, చికెన్ లాంటివి వండుతున్నారు. మట్టి కుండలో వంట చేయడం నిజానికి చాలా ఆరోగ్యకరం. కానీ… ఈ వంట చేసే క్రమంలో కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దామా…
• మట్టి పాత్రలో వండడానికి ముందు, పాత్రను నీటిలో కొంతసేపు నానబెట్టండి. మట్టి పాత్రలకు చాలా చిన్న రంధ్రాలు ఉంటాయి. కాసేపు నీటిలో నానబెట్టడం వల్ల మట్టి కుండ తేమగా ఉంటుంది. వంట చేసేటప్పుడు.. ఆ పాత్ర నుంచి నీటిని తీసేసి.., ఉపయోగించే ముందు గుడ్డతో తుడవండి. తర్వాత కొంచెం నీళ్లు పోసి గ్యాస్‌ను తక్కువ మంట మీద ఉంచాలి. 2 నిమిషాల తర్వాత ఆ నీటిని తీసేసి అందులో ఆహారాన్ని సిద్ధం చేసుకోవచ్చు.
• పెద్ద మంటపై స్టీల్ , అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తారు. కానీ మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు ఇలా చేయకూడదు. దీన్ని మట్టి కుండలో తక్కువ మంట మీద ఉడికించాలి. దీనివల్ల ఆహారం బాగా ఉడుకుతుంది, రుచిగా ఉంటుంది.
• మట్టి కుండలలో వంట చేసేటప్పుడు చెక్క లేదా సిలికాన్ గంటెలను ఉపయోగించండి. మట్టి కుండల్లో స్టీల్, అల్యూమినియం గరిటెలను ఉపయోగించడం వల్ల కుండలు త్వరగా పాడవుతాయి. ఎక్కువ కాలం నిలవదు.
• మట్టి కుండలు కడుగుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టీలు పాత్రలను స్క్రబ్బర్‌తో స్క్రబ్ చేసినట్లు.. వీటిని కడగకూడదు. మట్టి పాత్రలను చాలా సున్నితంగా కడగాలి. ఎందుకంటే దానిపై ఎక్కువ ఒత్తిడి పెట్టడం వల్ల అవి విరిగిపోయే అవకాశం ఎక్కువ.
• మార్కెట్లో మట్టి పాత్రలను ఎంపిక చేసుకునేటప్పుడు వాటి గురించి సరైన సమాచారం తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే సిరామిక్ పూతతో కూడిన మట్టి కుండలు వంటకు మంచిది కాదు.
నేటి ఆహారంలో సాధారణంగా ప్రతి ఒక్కరూ ఒక్కో రకమైన పోషకాల లోపంతో బాధపడుతున్నారు. అందుకు ఆరోగ్యానికి మేలు చేసే మినరల్స్‌తో కూడిన మట్టి కుండ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమా , క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మట్టితో చేసిన మట్టి కుండలు మన శరీరానికి హాని కలిగించే అనేక బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి.