Best protein foods : మనం బలంగా ఉండాలన్నా, కండరాలు బలోపేతం అవ్వాలన్నా, కండలు తిరగాలన్నా మనకు సరిపడినంత ప్రొటీన్ అవసరం. అందుకనే చాలా మంది రోజు వారీ ప్రొటీన్ అవసరాల కోసం ఎక్కువగా కోడి గుడ్ల మీదే ఆధారపడుతూ ఉంటాయి. అయితే దానిలాగే మంచి ప్రొటీన్ ఇచ్చే ఆహారాలు(FOODS) ఇంకా చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకుని వాటిని వాడుకునే ప్రయత్నం చేద్దాం.
ఒక కప్పుడు వండిన సోయాబీన్స్‌లో 28 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది. అలాగే వండిన పప్పుల్లోనూ 18 గ్రాముల వరకు ఇది దొరుకుతుంది. గుమ్మడి కాయ గింజల్లో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్‌తో పాటుగా పీచు పదార్థం, విటమిన్ ఏ,బీ,సీ,ఈలతో పాటు ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి శక్తినిచ్చే ఖనిజాలు, విటమిన్లు ఎన్నో దొరుకుతాయి.
పచ్చి బఠానీల్లోనూ ప్రొటీన్(PROTEIN) ఎక్కువగా దొరుకుతుంది. అందుకనే కండలు పెంచాలని అనుకునే వారు, కండరాలు బలంగా మారాలనుకునే వారు రోజు వారీ ఆహారంలో వీటిని తీసుకోవడం ఎంతో మంచిది. ఒక కప్పు పచ్చిబఠానీల నుంచి ప్రొటీనే కాకుండా తొమ్మిది గ్రాముల వరకు ఫైబర్ కూడా లభిస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. జీర్ణ క్రియకు ఎంతో మేలు చేస్తుంది. వీటితో పాటు క్వినోవా, చియా సీడ్స్, గ్రీక్ యోగర్ట్ లాంటి వాటిల్లోనూ చెప్పుకోదగ్గ రీతిలో ప్రొటీన్లు లభిస్తాయి. గుడ్డుకు బదులుగా వీటిని తినడం వల్లా మన రోజు వారీ అవసరాలకు సరిపడనంత ప్రొటీన్ అందుతుంది.