ముందునుంచి పూనకాలు లోడింగ్.. అరాచకం ఆరంభం.. అంటూ వాల్తేరు వీరయ్య పై భారీ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ముఖ్యంగా డైరెక్టర్ బాబీ.. ఓ మెగాభిమానిగా ఈ సినిమాను అంతకుమించి అనేలా తెరకెక్కించానని చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే ఇప్పుడు పూనకాలతో ఊగిసోతున్నారు మెగా ఫ్యాన్స్. సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకొచ్చిన వాల్తేరు వీరయ్య పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటించడం బిగ్గెస్ట్ ఎసెట్ అంటున్నారు. కొందరైతే.. రవితేజనే సినిమాలో ఎక్కువ క్రెడిట్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు. మెగాస్టార్ కూడా ముందే ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. సెకండాఫ్‌లో రవితేజ దుమ్ము దులిపేస్తాడు.
రవితేజ ఎంట్రీతో సినిమా మరో లెవల్‌కి వెళ్తుందని చెప్పారు. అన్నట్టుగానే రవితేజ క్యారెక్టర్లో మరో హీరోని ఊహించుకోలేమని అంటున్నారు అభిమానులు. అన్నయ్య తర్వాత.. రెండు దశాబ్దాల తర్వాత కలిసి నటించిన కూడా.. చిరు, రవితేజ అప్పుడెలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా ఇద్దరి మధ్య అన్నదమ్ముల బంధం.. కంటతడి పెట్టించిందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. మొత్తంగా వాల్తేరు వీరయ్యను మల్టీ స్టారర్ మూవీ అని చెప్పొచ్చు. దాంతో మెగా ఫ్యాన్స్ కంటే.. రవితేజ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు. ఇటీవలె ధమాకా చిత్రంతో 100 కోట్లు కొట్టిన రవితేజ.. ఇప్పుడు అన్నయ్యతో కలిసి మరోసారి డబుల్ ధమాకా ఇచ్చినట్టే. రవితేజ కూడా మున్ముందు మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాడనే చెప్పొచ్చు. ఏదేమైనా.. సోషల్ మీడియాలో రవితేజ లేకుండా వాల్తేరు వీరయ్యను ఊహించుకోలేమని అంటున్నారు.