మాస్ మహారాజా రవితేజ నుండి ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేయగా.. ధమాకాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు రవితేజ. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. భారీ ఓపెనింగ్స్ రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. పేరుకు తగ్గట్టే రెండో రోజు, మూడో రోజు కూడా డబుల్, త్రిబుల్ డోస్ కలెక్షన్లను రాబట్టింది. వీకెండ్‌కు క్రిస్మస్ కలిసి రావడంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది ధమాకా. నాలుగు రోజుల్లోనే 41 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లిందని అంటున్నారు. ఈ లెక్కన రవితేజ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది ధామాకా. అలాగే ఈ ఇయర్ ఫ్లాప్ లోటును పూడ్చేసి.. లెక్క సరిచేశాడు మాస్ మహారాజా.. అయితే ధమాకాతో డబుల్ డోస్ ఇచ్చిన రవితేజ.. వాల్తేరు వీరయ్యకు మరింత ఊపు ఇచ్చాడు. బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ నటిస్తున్న’వాల్తేరు వీరయ్య’ జనవరి 13న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో రవితేజ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ధమాకా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి వీరయ్యపై పడింది. ఈ సినిమాతో మెగాస్టార్, మాస్ రాజా కలిసి పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు. అందుకు తగ్గట్టే.. తాజాగా రిలీజ్ అయిన టైటిల్ ట్రాక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్, పాటలు ఒకెత్తు కాగా.. ఈ టైటిల్ సాంగ్ ఇంకో ఎత్తు అని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్, మెగాస్టార్ వింటేజ్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. మొత్తంగా రవితేజ, మెగాస్టార్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అంటున్నారు.