నిజమే.. కోపం వచ్చి తమ్ముడు పవన్ కళ్యాణ్ షూటింగ్ నుంచి వెళ్లిపోతే.. ఆ తర్వాత మెగాస్టార్ కోపంతో రగిలిపోయాడు. ఇది నిజంగానే జరిగింది. ఇక్కడ పవన్ గొడవ పడింది.. చిరు కోప్పడింది ఒకరిపై ఒకరు కాదు. ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో.. చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్పేశాడు డైరెక్టర్ బాబీ.
Bobby: ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ స్పీచ్ హైలెట్‌గా నిలిచింది. ఇక మెగా ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ ఇచ్చిన స్పీచుల్లో హైపర్ ఆది, డైరెక్టర్ బాబీదే అని చెప్పొచ్చు. తనదైన పంచులు, డైలాగ్స్‌తో మెగా ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపాడు హైపర్ ఆది. ఇప్పటి వరకు మెగాస్టార్ పై కామెంట్స్ చేసిన వారెవ్వరిని వదల్లేదు ఆది. మెగాస్టార్ మంచోడు ముంచేశారు.. కానీ తమ్ముడు మొండోడు.. లెక్కలన్నీ సరి చేస్తాడాని చెప్పాడు ఆది. ఇక చివరగా వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్‌కు సాలిడ్ ఇచ్చిన దర్శకుడు బాబీ.. భోళా శంకర్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అన్నయ్యను దూరం నుంచి అభిమానించడం వేరు.. దగ్గరి నుంచి చూశాకా.. అభిమాని అనే పెద్ద పదం ఏదైనా ఉందేమో అని వెతుకుతున్నాను. వాల్తేరు వీరయ్య తరువాత నాకు గౌరవం పెరిగింది. హైపర్ ఆది మెగాభిమానుల మంటను చెప్పేశాడు. మెగాస్టార్‌కు ఆవేశం, కోపం రాదు అంటారు.. కానీ నేనో సందర్భం చెబుతాను.. అని పవన్ పై చిరుకు ఉన్న అభిమానం, పవన్‌ను ఎవ్వరైనా ఏమైనా అంటే.. ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు. సినిమా పేరు చెప్పలేదు గానీ.. ఓ పెద్ద డాక్టర్ ఇంట్లో పవన్ కళ్యాణ్ ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది.. లైట్ మెన్స్ షూలు వేసుకుని ఇంట్లో నడుస్తున్నారు.. దాంతో ఇంటి ఓనర్ వారి పై అరిచాడు.. ఇడియట్స్ గెట్ అవుట్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడు.. ఇది ఎక్కడో బయటున్న పవన్ విన్నాడు. లోపలకు వచ్చి ఏమైంది. ఇల్లుని షూటింగ్ కోసమే కదా ఇచ్చారు.. డబ్బులు తీసుకున్నారు కదా.. వాళ్లను షూలు వేసుకోనివ్వకపోతే.. షూటింగ్ చేయనని.. అక్కడి నుండి అలిగి వెళ్లిపోయాడు పవన్ కళ్యాణ్.
కొంత సేపటి తర్వాత ఈ విషయం మెగాస్టార్ చిరంజీవికి తెలిసింది. వెంటనే ఆయన ఇంటి ఓనర్‌కి ఫోన్ చేశారు.. ఎవడ్రా నువ్.. ఇంట్లోంచి వెళ్లమనడానికి.. నువ్వెంత నీ ఇళ్లు ఎంత.. సినిమా వాళ్లు కష్టపడతారని తెలిసే కదా నీ ఇళ్లు ఇచ్చింది.. డబ్బులు తీసుకుంటున్నావ్ కదా.. నీకు నిజంగానే నీ ఇంటి మీద అంత ప్రేమ ఉంటే.. తాళం వేసుకుని కూర్చో.. షూటింగ్‌లకు ఇవ్వొద్దు.. రెంట్లు వసూల్ చేయొద్దు.. నా తమ్ముడు అలిగి వెళ్లి గంట అయింది.. కాబట్టి ఊరుకున్నా.. వెంటనే తెలిస్తే వచ్చి షూటింగ్ జరిపించే వాడిని.. అని కోపంతో రగిలిపోయారట మెగాస్టార్. అందుకే.. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే ఆయన ఊరుకోరు.. మనలాంటి తమ్ముళ్లని అన్నా కూడా ఊరుకోరు.. అంటూ బాబీ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.