True Lover Movie Team Exclusive Interview Manikandan Sri Gouri Priya
True Lover: ట్రూ లవర్ సినిమా అనేది ఏదో మ్యాజిక్ అని కాదు ఇది చాలా కామన్ ఎమోషన్ అని హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ వెల్లడించారు. సినిమాలో చాలా ప్రేమ ఎమోషన్‌ను మరో కోణంలో చూపించారు, ఇది చాలా సినిమాలో చూసినప్పటికీ కొత్తగా ఉంటుందని హీరో మణికందన్ తెలిపారు. సినిమా మొత్తం చాలా రియాలిటీగా ఉంటుందని, నిజ జీవితంలో ఎన్నో క్యారెక్టర్లకు సరిపోతుందని హీరోన్ చెప్పారు. సాధారణంగా చాలా మంది ఒక మనిషిపై త్వరగా ఓ నిర్ణయానికి వచ్చేస్తారు కానీ అది నిజం కాదు అతని పరిస్థితుల గురించి తెలుసుకుంటే నిజం ఏంటో తెలుస్తుంది. అదే ట్రూ లవర్ అనే సినిమా అని హీరో, హీరోయిన్లు చెప్పారు. ఇక సినిమా ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వడం లేదని ఇది ఒక అనుభూతి అని పేర్కొన్నారు.