దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నిత్యం వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ అమ్మవారు మహిషాసురమర్దినీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. లోక కంటకుడైన మహిషాసురుణ్ని సంహారం చేసిన మహోగ్రరూపం ఇది. సకల దేవీదేవతల శక్తులన్నీ ఈ తల్లిలో మూర్తీభవించి ఉంటాయి. ఈమె అనుగ్రహం కలిగితే సాధించలేనిది ఏదీ లేదు. మహిషాసుర సంహారం జరిగిన నవమి రోజునే ‘మహర్నవమి’గా జరుపుకోవటం ఆచారంగా వస్తుంది.