ప్రసిద్ద చార్ధామ్ యాత్రలో రోజుకు 20 వేల మంది యాత్రికులు దర్శనం చేసుకోనున్నారు. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలకు యాత్రికులు బారులు తీరారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చార్ధామ్ యాత్రకు యాత్రికులు ఆసక్తి చూపుతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల కోసం యాత్రికులు భారీగా నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 38 లక్షల మంది సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు.