యాదాద్రి ఆలయంలో ఉద్యోగవకాశాల ప్రకటన విడుదలైంది. ఎంచక్కా ఆలయ పరిధిలో ఉద్యోగం చేసుకునే అవకాశం లభించింది. భగవంతుడి సన్నిధిలో ఉద్యోగం చేయడమంటే మాటలా? అతి కొద్దిమందికి మాత్రమే ఆ భాగ్యం దక్కుతుంది.
నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని మే 31వ తేదీ బుధవారం కర్రపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతేడాది మట్టితో 50 అడుగుల నిర్మాణం చేయగా.. ఈసారి ఏకంగా ఎత్తైన విగ్రహం నిర్మిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది.
సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ఆలయాల పున:నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆలయాల నిర్మాణానికి ముందుకువచ్చింది. ఆలయం కరీంనగర్ లో నిర్మాణం కావడం మా అదృష్టం’
బ్రాహ్మణ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సదనం ప్రారంభించుకున్న శుభ సందర్భంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలు మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నా.
దుర్గాఘాట్(Durga Ghaat) నుంచి గిరి ప్రదక్షణ మార్గంలో దేవస్ధానం బస్సు నడపాలని, దేవస్ధానంలో అమ్మవారి సేవ చేసుకునే ఉచిత ప్రసాదం అందజేయాలని అధికారులు నిర్ణయించారు. అమ్మవారి దర్శన సమయంలో వృద్ధులకు, వికలాంగులకు మరిన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.