మేషం
మీరు ఈ రోజు సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.సోమరితనం వీడొద్దు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడుతారు. స్త్రీలు మనోలాసాన్ని పొందుతారు.
వృషభం
మీ కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మీ పనికి తగిన గౌరవం లభిస్తుంది. అధికారిక పనిలో మార్పులు ఉండొద్దు. అధికారిత పనిలో మార్పులు ఉండొచ్చు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు లాభిస్తాయి.అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.
మిథునం
మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు.విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.
కర్కాటకం
స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. పనిపై శ్రద్ధ వహించండి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద క్లయింట్లతో వివాదాలను నివారించాలి. ఆహార వ్యాపారం చేసే వారికి లాభిస్తుంది.
సింహం
కొత్త వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది.మీ ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. విద్య , ప్రభుత్వ శాఖలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది.
కన్య
మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి పరిచయాలు పెంచుకోవాలి. సహోద్యోగులు, సహచరుల తీరు మీకు మరింత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారంలో నూతన ప్రారంభానికి ఆర్థిక అవరోధాలు ఉండొచ్చువ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
తుల
ఉద్యోగులు, వ్యాపారులకు స్నేహితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
వృశ్చికం
ఈ రోజు మీ మనసులో ఎవరిపైనా కోపం పెరగనివ్వండి. గతంలో చేసిన తప్పులకు ఎవరైనా క్షమించమని అడిగితే వారిని నిరాశపరచవద్దు.విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి.
ధనుస్సు
కుటుంబ కలహాలు దూరమవుతాయి. కొత్త వ్యాపారం, ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆహారపు అలవాట్లు కొంత మార్చకోవాలి. కుటుంబంలో ఎవ్వరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.
మకరం
ఈ రాశివారు తమ పరిచయాలను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ఉత్సాహంగా ఉండాలి. ఉద్యోగులు సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
కుంభం
మీరు చేసే వ్యాపారంలో లాభాలొస్తాయి. ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ అవసరం. రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి. పనిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు.
మీనం
ఉద్యోగుల నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి.కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. అహంకారం ప్రదర్శించవద్దు నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.