TG: నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి భారీగా తరలొస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీతో మండపాలు కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.