AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో ఇవాళ కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. జ్ఞానప్రదాయిని సరస్వతీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మూలానక్షత్రం రోజు అమ్మవారిని దర్శంచుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారని, అందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దుర్గామల్లేశ్వర ఆలయ ఈవో కేఎస్ రామారావు పేర్కొన్నారు.