AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఇవాళ శాంతిహోమం నిర్వహించనున్నారు. సర్వదోష నివారణార్థం ప్రభుత్వ ఆదేశాలతో శాంతిహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో హోమం నిర్వహిస్తున్నారు. ఈవో రామారావు సమక్షంలో ఆలయంలోని చండీ యాగశాలలో హోమం చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.