TG: మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గాభవానీ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీర నది ఏడుగా చీలిన పాయల్లో ఆలయం ఉండటంతో.. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నదికి వరద పోటెత్తి.. ఆలయం వరద నీటిలో చిక్కుకుపోతుంది. అయితే, దసరా ఉత్సవాల్లో భాగంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగాల్సి ఉండగా వరదనీరు అడ్డంకిగా మారింది. దీంతో రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ గాయత్రీదేవి అలంకారంలో ఏడుపాయల అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.