భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజమే.. కానీ అంతమాత్రానికి భర్తను భార్య, భార్యను భర్త వదిలేయలేరు కదా. విడాకులు తీసుకోరు కదా. అఫ్ కోర్స్.. చిన్న చిన్న గొడవలకు కూడా విడాకులు తీసుకునే వాళ్లు ఉన్నారు కానీ.. చాలా తక్కువ మంది ఆవేశంలో ఆ పని చేసి తర్వాత బాధపడతారు. ఏ భార్యాభర్త మధ్య గొడవ జరగకుండా ఉండదు. ఆ తర్వాత వెంటనే కలిసిపోయే మనస్తత్వం ఇద్దరికీ ఉండాలి. లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయినా అవ్వాలి. తాజాగా బెంగళూరులో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగి 6 నెలలు అవుతోంది కానీ.. తాజాగా ఈ ఘటనలో అసలు వాస్తవం బయటపడింది.
బెంగళూరులోని అక్షయ నగర్లో నేపాల్‌కు చెందిన అమర్ దామి, పుష్పదామి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లకు పెళ్లి అయి చాలా కాలం అయింది. బతుకు తెరువు కోసం నేపాల్ నుంచి బెంగళూరుకు వచ్చారు. అయితే.. అమర్ దామి తాగుబోతు. రోజూ తాగి వచ్చి భార్యను కొడుతుండేవాడు. అనుమానిస్తూ ఉండేవాడు. గత ఆరు నెలల కింద కూడా ఒకసారి ఇలాగే మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. భర్త పోరును భరించలేక కోపంతో భర్త లేని సమయం చూసి జులై 8న ఇల్లు వదిలి వెళ్లింది పుష్ప దామి. రాత్రి అవుతున్నా భార్య ఇంకా ఇంటికి రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అమర్ దామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తన కోసం గాలించారు కానీ.. పుష్పదామి జాడ దొరకలేదు.
కట్ చేస్తే ఆరు నెలలు గడిచాయి. ఇటీవల హుళిమావు అనే ప్రాంతంలో చెట్ల పొదల్లో ఒక చెట్టుకు ఉరేసుకొని చనిపోయిన ఉన్న ఒక వ్యక్తి శరీరం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ బాడీని పరిశీలించారు. ఉరి వేసుకొని చనిపోయి 6 నెలలు కావడంతో మనిషి పుర్రె, కొన్ని అవశేషాలు తప్పితే మనిషి పూర్తిగా గుర్తుపట్టే విధంగా లేరు. కానీ.. ఆనవాళ్ల ప్రకారం అది పుష్పదామి మృతదేహం అని పోలీసులు గుర్తించారు. అంటే.. అప్పుడు ఇల్లు వదిలేసి వెళ్లి భర్త మీద కోపంతో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని పుష్పదామి చనిపోయింది. ఈవిషయం తెలుసుకొని భర్త అమర్ దామి బోరుమంటూ విలపించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.