ASR: ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ, మండల స్థాయిల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. ప్ల కార్డులు, స్లోగన్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించి, జిల్లాలోని అన్ని కళాశాలల్లో 18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ ఓటు నమోదు చేయాలన్నారు.
VZM: గజపతినగరంలో 2020లో జరిగిన యాక్సిడెంట్ కేసులో నిందితుడికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి విజయ్ రాజకుమార్ తీర్పు వెల్లడించారని స్థానిక SI కిరణ్ కుమార్ సోమవారం తెలిపారు. కారుతో బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో పురిటిపెంటకు చెందిన సాంబశివరావుపై కేసు నమోదైందని, ఈ కేసును విచారించిన జడ్జి నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విదించారని పేర్కొన్నారు.
VSP: సింహాద్రి అప్పన్నస్వామి ఆలయంలో ధనుర్మాసంతో పాటు వివిధ ఉత్సవాల నేపథ్యంలో రద్దు చేసిన ఆర్జిత సేవలను ఇవాళ నుంచి పునరుద్ధరించనున్నట్లు ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు తెలిపారు. ఆలయంలో జరిగే నిత్య కల్యాణం, సహస్రనామార్చన, గరుడ వాహన సేవ, స్వర్ణ పుష్పార్చన, స్వర్ణ తులసీదళార్చన, తదితర ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. భక్తులు గమనించాలన్నారు.
కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపడాన్ని తీవ్రంగా పరిగణించి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని పేర్కొన్నారు.
KRNL: నంద్యాల జిల్లాల న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ. కబర్థి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివాదాలు కోర్టుల వరకు వెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 23 వరకు సాగే ఈ శిక్షణ ఉంటుందన్నారు.
BPT: పిడుగురాళ్ల- ఓడరేవు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో సిమెంట్ లోడ్ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. చిలకలూరిపేట నుంచి వస్తున్న ఈ లారీ పర్చూరు సమీపంలో ప్రమాదానికి గురవ్వడంతో వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.
VSP: పెందుర్తి కూడలిలో ఉన్న ఓ కళ్యాణ మండపంలో మంగళవారం ఉదయం 9 గంటలకు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ గండి బాబ్జి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
GNTR: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సోమవారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి, కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే, ప్రజలకు న్యాయం చేయడంలో అలసత్వం వహించవద్దని సూచించారు.
చిత్తూరు: జిల్లాలో ఈ నెల చివరిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ పర్యటనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని చెప్పారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ATP: ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సోమవారం ఏఆర్ సిబ్బందికి అనంతపురం పోలీస్ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మొబలైజేషన్ కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు, బీపీ, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు చేశారు. వైద్యులు సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు. పోలీసుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎస్పీ తీసుకుంటున్న శ్రద్ధ పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
కృష్ణా: గ్రామీణ సౌందర్యానికి నిదర్శనంగా ఈడుపుగల్లు గ్రామం నిలుస్తోంది. గ్రామాలను స్వచ్ఛంగా, అందంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయి. ఈడుపుగల్లు గ్రామ ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన “ఐ లవ్ ఈడుపుగల్లు” ఆకర్షణీయ లైటింగ్ బోర్డు స్థానికులు, ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది.
సత్యసాయి: మడకశిరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 23న జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పరిశీలించారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో పదివేల ఇళ్ల పట్టాల పంపిణీ, 100 స్మశాన వాటికల అంకితం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
E.G: రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తక్షణమే స్పందించారు. జిల్లా రవాణా అధికారితో మాట్లాడి, విజయవాడ, విశాఖ, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లే ప్రయాణికులకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.
VZM: జిల్లాలో అర్హులైన అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులకు సంబంధించిన SYM, NPS పథకాలను వర్తింపజేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ పథకాలకు జిల్లాలో 9,300 మంది నుంచి దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ మేరకు మార్చిలోగా 15 వేల మందికి మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య: చిట్వేలు మండలం తిమ్మాయపాలెం పంచాయతీ గట్టుమీద పల్లెలో జూద శిబిరంపై సోమవారం పోలీసులు దాడి చేశారు. ఎస్ఐ వినోద్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో జూదం ఆడుతున్న పది మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 12,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదం, కోడిపందేలు వంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.