NLR: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం నెల్లూరు నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు వేణుగోపాలస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం నవాబ్ పేట శివాలయంలో అభివృద్ధి ప్రతిపాదనలపై సమీక్షా సమావేశంలో పాల్గొననున్నట్లు కార్యకర్తలు తెలిపారు.
అనకాపల్లి: మండల కేంద్రమైన మునగపాకలో రోజురోజుకు పెరిగిపోతున్న చెత్తతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చెత్తను సోమవారం వాహనాలపై విశాఖ జిందాల్ కంపెనీకి తరలించారు. గ్రామ సర్పంచ్ అప్పారావు మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చెత్తను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో పారిశుధ్యం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
PLD: కోటప్పకొండ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కోటప్పకొండలో నూతన రహదారుల ప్రారంభోత్సవానికి రావాలని సోమవారం ఆహ్వానించగా, ఈ నెల 22న వస్తానని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి ఏర్పాట్లను కూడా అదేరోజు పరిశీలించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
PPM: రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఈ నెల 26 నుంచి 28 వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా అదనపు ఎస్పీ వీ.మనీషా రెడ్డి సోమవారం ఆ ప్రాంతంలో పర్యటించి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె జాతర ఏర్పాట్లు పటిష్ఠంగా చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు, పోలీసు సిబ్బందికి ఆదేశించారు.
ప్రకాశం: పామూరు మండలంలోని అయ్యవారిపల్లికి ఇవాళ సాయంత్రం 4.30కి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి వస్తున్నట్లు మండల టీడీపీ నాయకులు మాల్యాద్రి తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఆవిష్కరణ, బస్సు షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే పాల్గొంటారని అన్నారు. అందరూ హాజరు కావాలన్నారు.
అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ గ్రౌండ్లో ఈ నెల 22 నుంచి ఆంధ్ర, విదర్భ జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణకు ఏసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్ర జట్టుకు రికీ భూయ్ కెప్టెన్గా, స్టార్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి జట్టులో కీలక పాత్ర పోషించనున్నారు. విదర్భ జట్టు అక్షయ్ వాడ్కర్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది.
SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు స్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి K.N.V.D.V ప్రసాద్ ఉన్నారు.
VSP: పాతనగరం కురుపాం మార్కెట్లో కొలువైన శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బాబూ రావు తెలిపారు. ఉదయం 7 గంటలకు అమ్మవారి విగ్రహానికి క్షీరాభిషేకం, 10 గంటలకు మహిళలచే సామూహిక కుంకుమ పూజలు, 11 గంటలకు హోమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన కోరారు.
BPT: బాపట్ల జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 18,397 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు సోమవారం కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఒకేషనల్ విభాగంలో 895 మంది విద్యార్థుల కోసం మరో 11 కేంద్రాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
GNTR: గుంటూరు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మొఖమాటం సురేశ్ బాబు జిల్లా ప్రధాన కోర్టు ఇన్ఛార్జ్ ప్రభుత్వ ప్లీడరుగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో గుంటూరులోని సివిల్ కోర్టుల్లో ఏజీపీ వ్యవహారాలను కూడా పరిపాలన సౌలభ్యం మేరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సురేశ్ చూడాలని పేర్కొన్నారు.
కడప: జిల్లాలో JEE మెయిన్ పరీక్షలకు 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 21, 24, 28, 28 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఎగ్జామ్స్ సెంటర్ వద్ద 144 సెక్షన్ విధించనున్నారు. సెంటర్లు ఇలా.. కందుల ఓబుల్ రెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడప, KSRM ఇంజనీరింగ్ కాలేజ్ కడప, KLM మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ కడప, సాయి రాజేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు.
NDL: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.6,60,000 మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సోమవారం PGRS కార్యక్రమంలో SP సునీల్ షొరాణకు నంద్యాలకు చెందిన శ్రీధర్ రావు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్కు చెందిన సంపత్ కుమార్ రెడ్డి తనను మోసం చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.
అనకాపల్లి: చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి 2024-25లో చెరుకు సరఫరా చేసిన రైతులకు బకాయిలు చెల్లించి వారిని ఆదుకోవాలని జనసేన సమన్వయకర్త పీవీఎస్ఎన్ రాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రూ.32 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.5.83 కోట్లు మాత్రమే చెల్లించినట్లు తెలిపారు.
ఏలూరు: జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం అక్షర ఆంధ్ర కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం 3.44 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారని తెలిపారు. వీరిని రానున్న మూడేళ్లలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
VSP: భీముని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్రం అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీన కళాశాలలో హాజరు కావాలని సూచించారు. MSC పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% పైబడి మార్కులు సాధించిన వారు అర్హులని సూచించారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి ఆమె కోరారు.