SKLM: జిల్లాలో తొలిసారిగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హాట్ ఎయిర్ బెలూన్ విహారం మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. దీనికి టికెట్ ధర రూ. 1000 గా నిర్ణయించినట్లు తెలిపారు. రథసప్తమి వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించేందుకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
ATP: దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం గుంతకల్లు రైల్వే డివిజన్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు డివిజన్‌లోని బళ్లారి, హగరి సెక్షన్‌ను తనిఖీ చేయనున్నారు. అనంతరం నంద్యాలకు బయలుదేరి వెళ్లనున్నారు. జీఎం వెంట గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, తదితర శాఖల అధికారులు పాల్గొనున్నారు.
BPT: మార్టూరు మండలం వలపర్లలో రూ. 198 కోట్లతో సోలార్ సెల్ మాడ్యులర్ యూనిట్ ఏర్పాటుకు ఒక ప్రైవేట్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం వివరాలు వెల్లడించారు. ఈ యూనిట్ స్థాపనతో స్థానికంగా పారిశ్రామికాభివృద్ధి వేగవంతం కానుంది.
సత్యసాయి: గోరంట్ల పట్టణంలో రెడ్డి సోదరుల కోరిక మేరకు కళ్యాణ మండప నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి 60 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి ప్రకటించారు. త్వరలోనే భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చేశారు. ఎంపీ ప్రకటనపై రెడ్డి సోదరులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
SKLM: ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర బీజేపీ స్టేట్ ఆర్టీఐ కోఆర్డినేటర్ కిల్లి శ్రీరామ్మూర్తి కోరారు. నిన్న జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ ఏడాది రెండో పంట అయిన ఖరీఫ్‌లో అపరాలు పంట తీవ్రంగా నష్టపోయిందని అన్నారు.
PPM: ఎంఎస్ఎంఈల పనితీరు వేగవంతం కావాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల పురోగతి, ఎగుమతుల మండలి సమావేశం ఆయన అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో కమిటీ సభ్యులతో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు.
తిరుపతిలో జూ పార్క్ రోడ్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వెస్ట్ పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 30 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి జూ పార్క్ అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వద్ద ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా సర్కిల్ ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్స్) ఎం.లక్ష్మణరావు తెలిపారు. ఈ విచారణ హైబ్రిడ్ విధానంలో ప్రత్యక్షంగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
GNTR: జిల్లాలో 10 రోజుల పాటు జరిగిన సరస్ మేళా అధికారుల, ప్రజాప్రతినిధుల సహకారంతో అత్యంత విజయవంతంగా ముగిసిందని కలెక్టర్ తమీమ్ అన్సారియా హర్షం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. 17 రాష్ట్రాలకు చెందిన మహిళలు ఏర్పాటు చేసిన 343 స్టాల్స్ ద్వారా సుమారు రూ.25 కోట్ల ఆదాయం సమకూరిందని, అధికారులను అభినందించారు.
తిరుపతి: చంద్రగిరి మండలంలోని ఏ.రంగంపేటలో బుధవారం పశువుల పందెలు (జల్లికట్టు) నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది కనుమ రోజున పందేలను నిర్వహించడం ఆనవాయితీ. అదే రోజు గ్రామంలోని ఇద్దరు మృతి చెందిన చెందడంతో శూతకం కారణంగా వాయిదా వేశారు. దీంతో బుధవారం వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు.
NDL: జిల్లాలో 1,00,686 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం ‘ఉల్లాస్-అక్షరాంధ్ర’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ బృహత్తర కార్యం కోసం 10,667 మంది వాలంటీర్లు ఉచిత సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని వెల్లడించారు. వీరికి త్వరలోనే శిక్షణ ఇస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రకాశం: పామూరు మండలంలో చిమలదిన్నెలో మహర్షి అనే యువకుడుపై జరిగిన దాడి దుర్మార్గం అని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. రోడ్డుమీద వెళ్తుండగా ఆటో తగిలిందన్న చిన్న కారణంతో టీడీపీ నాయకులు అతడిని స్తంభానికి కట్టి రెండు గంటలపాటు చితకబాదడం అత్యంత అమానుషం అని ఖండించారు. సోమవారం రాత్రి గుంటుపల్లిలో ఉన్న మహర్షిని పరామర్శించారు.
KRNL: జిల్లాలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లోటుపాట్లకు తావు ఇవ్వరాదన్నారు.
ATP: రాష్ట్రంలో విద్యుత్ టారిఫ్ వ్యవ హరంపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానిక ట్రాన్కో డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మా నాభ పిళ్లై తెలిపారు. ఈనెల 20, 22, 23, 27 తేదీల్లో రాష్ట్ర ఎలక్ట్రికల్ సిటీ, రెగ్యులేటర్ కమిటీ ఆధారిటీ చైర్మన్ వీడియో కాన్ఫరెన్స్ లో వినియోగదారులతో మాట్లాడుతారన్నారు.
WG: తణుకు రహదారిలోని గవర్లపాలెం వద్ద గల రైల్వే గేటును ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మూసివేస్తున్నట్లు ద.మ. రైల్వే సోమవారం ప్రకటించింది. ఇందుకోసం సూచిక బోర్డును గేటు వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కోరారు.