ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా రెండో త్రైమాసికంలో లాభాల్లో దూసుకెళ్లింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 153.1% పెరిగి రూ.1,250కోట్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. దీంతో కంపెనీ ఆదాయం రూ.13,313.2 కోట్లుగా నమోదైంది. గతేడాదితో పోల్చితే 3.49% వృద్ధిని సాధించింది. ఈ సందర్భంగా తమ కంపెనీ షేర్ హోల్డర్లకు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.15 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపింది.