TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో చిట్టీలు తీసుకొచ్చి మరో అభ్యర్థి పట్టుపడ్డాడు. హైదరాబాద్ జిల్లాలోని జీ.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ పరీక్ష కేంద్రంలో ఒక అభ్యర్థి చిట్టీలు తీసుకొచ్చినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో వారు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో సదరు అభ్యర్థిని పరీక్షకు అనుమతించలేదని తెలిపారు. అంతేకాకుండా ఆ అభ్యర్థిని డిబార్ చేసినట్లు టీజీపీఎస్సీ అధికారులు స్పష్టంచేశారు.