Whatsapp : అలా అయితే భారత్‌ నుంచి వాట్సాప్‌ ఔటేనంటున్న మెటా

గోప్యతను వెల్లడించాల్సి వస్తే భారత్‌లో వాట్సాప్‌ ఉండబోదని దాని మాతృ సంస్థ మెటా వెల్లడించింది. గోప్యత విషయంలో దిల్లీ హైకోర్టులో నడుస్తున్న కేసు విషయంలో మెటా ఈ విధంగా స్పందించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 12:51 PM IST

Whatsapp : వాట్సాప్ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ విషయంలో కట్టుబడి ఉంటుందటని మెటా సంస్థ వెల్లడించింది. భారత్‌తో ఐటీ రూల్స్‌ 2021లోని 4(2) నిబంధనను సవాల్‌ చేస్తూ వాట్సాప్‌ ధిల్లీ హైకోర్టులో(Delhi High Court) కేసు వేసిన సంగతి తెలిసిందే. ఏ మెసేజ్‌ అయినా మొదట ఎవరి నుంచి వచ్చిందనేది తెలియజేయాలని ఈ నిబంధన చెబుతోంది. దీంతో అది సాథ్యం కాదని మెటా( Meta) చెబుతోంది.

చదవండి : ఓటేసేందుకు లైన్లో నిలబడిన మిస్టర్‌ కూల్‌

అలా మెసేజ్‌ మొదట ఎవరి నుంచి వచ్చిందనేది తెలియజేయాలంటే ఏళ్లపాటు డాటాను పెద్ద ఎత్తున స్టోర్‌ చేయాల్సి వస్తుందని హైకోర్టుకు మెటా( Meta) తెలిపింది. అలా చేయడం వల్ల తమ ‘ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌’ విధానం భంగపడుతుందని తెలిపింది. ఈ విధానం వల్ల డాటా మరెక్కడా స్టోర్‌ కాదు. నేరుగా పంపిన వారిని నుంచి అందుకునే వారికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది.

చదవండి : పెళ్లి గౌనును రీడిజైన్‌ చేయించేసిన సమంత!

ఈ విధానం వల్ల గోప్యత ఉంటుంది. అదే మెసేజ్‌లు ఎవరి నుంచి వచ్చాయో తెలియజేయాలంటే ఈ విధానాన్ని అమలు చేయడం కుదరదు. అదే గనుకు చేయాల్సి వస్తే భారత్‌ నుంచి వాట్సాప్‌(Whatsapp) ఔట్‌ అవ్వాల్సి ఉంటుందని మెటా తెలిపింది. అంతే తప్ప తమ విధానాన్ని మార్చుకోలేమని కోర్టుకు స్పష్టం చేసింది.