»Stock Market In Huge Gains Sensex 872 Points Plus December 14th 2023
Stock market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 872 పాయింట్ల ప్లస్
వచ్చే ఏడాది US ఫెడరల్ రిజర్వ్ కనీసం మూడు రేట్ల తగ్గింపులను అంచనా వేసిన తర్వాత గురువారం భారతీయ ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సహా అన్ని సూచీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
Stock market in huge gains Sensex 872 points plus december 14th 2023
అగ్రరాజ్యం అమెరికా వడ్డీ రేట్లను అలాగే ఉంచుతామని యుఎస్ ఫెడరల్ చీఫ్ తెలుపడంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు పుంజుకున్నాయి. అయితే బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈ నిర్ణయాన్ని అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల సమయానికి బిఎస్ఇ సెన్సెక్స్ 908.91 పాయింట్లు ఎగబాకి 70,493.51 వద్ద, ఎన్ఎస్ఇ నిఫ్టీ 250.85 పాయింట్లు లాభపడి 21,177.20 వద్దకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ సైతం 730 పాయింట్లు పెరిగి 47,820 పాయింట్ల పరిధిలో కొనసాగుతుండగా..నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 380 పాయింట్లు లాభపడి 45,327 పాయింట్ల పరిధిలో ఉంది.
దీంతో అన్ని సెక్టార్లలో సూచీలు నిఫ్టీ ఐటి ఇండెక్స్ 2.8 శాతం లాభపడగా.. నిఫ్టీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, పిఎస్‌యు బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాల్టీ సూచీలు (2 శాతం వరకు లాభపడటం) ఆధిక్యంలో ఉన్నాయి. విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా వరుసగా 0.82 శాతం, 0.93 శాతం పెరిగాయి. ఫ్రంట్‌లైన్ సూచీలతో సమానంగా కదిలాయి.
ఈ క్రమంలోనే ప్రస్తుతం టాప్ ఐదు స్టాకుల్లో బజాజ్ ఫైనాన్స్, HCL టెక్, LTIMindtree, టెక్ మహీంద్రా, విప్రో ఉన్నాయి. వీటితోపాటు హిండాల్కో, అదానీ పోర్ట్స్, విప్రో కూడా లాభాల్లో కొనసాగగా.. పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, టాటా కన్స్యూమర్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ వంటివి క్షీణతకు దారితీశాయి. అంతకుముందు డౌ జోన్స్ రికార్డు స్థాయిని తాకింది, ఇది ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేసింది.
ఈ నేపథ్యంలోనే ఎన్బిసిసి (ఇండియా) స్టాక్ ఎన్ఎస్ఇలో రూ.83.20 వద్ద ట్రేడవుతోంది. ఈ రోజు స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయికి రూ.84.75 వద్దకు చేరిన తర్వాత 3.74% పెరిగింది. ఈ కంపెనీ వివిధ రాష్ట్రాల్లో సహకార మంత్రిత్వ శాఖ/ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కింద NCDC చట్టబద్ధమైన కార్పొరేషన్ నుంచి రూ.1,500 కోట్ల విలువైన ఆర్డర్‌ను అందుకుంది.