»Sensex Lost 538 Points September 21st 2023 Bse Stock Market India
Sensex lost: భారీ నష్టం..538 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు అమెరికా వడ్డీ రేట్ల ఒత్తిడి లోనైనట్లు కనిపిస్తుంది. ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందని అంచనాలు వచ్చిన నేపథ్యంలో అనేక కంపెనీలు స్టాక్స్ నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా దిగువకు పయనిస్తున్నాయి.
indian stock market losses december 21st 2023 sensex loss 440 points
అమెరికా ఫెడ్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు గురించి సంకేతాలు వచ్చాయి. ఎక్కువ కాలం వడ్డీ రేట్లు ఇలాగే ఉండలేవని ఆర్థిక నిపుణలు స్పష్టం చేశారు. దీంతో FOMC రేట్లు ఈ ఏడాది చివరిలో ప్రస్తుత స్థాయి కంటే 0.25 శాతం ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేశారు. దీంతో గ్లోబల్ బాండ్ మార్కెట్ సహా దేశంలోని పలు కంపెనీల ఈక్విటీ షేర్లు దిగువగా పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఒక దశలో 563 పాయింట్లు క్షీణించి 66,255 వద్ద, నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 19,755 వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 1,499 షేర్లు పురోగమించగా, 1,223కుపైగా షేర్లు క్షీణించాయి.
ఈ రోజు సీవరేజ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ EMS లిమిటెడ్ సెప్టెంబర్ 21న అరంగేట్రం చేసింది. దీని ఇష్యూ ధరకు 33.67 శాతం ప్రీమియంతో లిస్టింగ్ చేయబడింది. ఈ స్టాక్ ఎన్ఎస్ఈలో రూ.282.05, బిఎస్ఇలో రూ. 281.55 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే దీని ఇష్యూ ధర రూ.211. ఈ క్రమంలో అదానీ పోర్ట్స్, హిందాల్కో, అదానీ ఎంటర్ ప్రైజెస్, జియో ఫైనాన్షియల్, బీపీసీఎల్ స్టాక్స్ టాప్ 5 లాభాల్లో కొనసాగుతుండగా, ఐసీఐసీఐ, హెచ్సీఎల్, టీసీఎస్, గ్రాసిమ్, ఎల్టీఐ మెండ్ ట్రీ కంపెనీల స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.