OnePlus Ace 2V:వన్ ప్లస్ ఏస్ 2వీ ఇండియాలో ధర, ఫీచర్ల వివరాలు ఇవే
OnePlus Ace 2V:మిడ్ సెగ్మెంట్‌పై వన్ ప్లస్ (OnePlus) కంపెనీ దృష్టిసారించింది. రూ.30 వేల లోపు మొబైల్స్ సేల్స్ ఎక్కువ ఉంటున్నందన.. ఆ ధరలో కొత్త ఫీచర్లతో (Features) తీసుకొస్తోంది. తాజాగా వన్ ప్లస్ ఏస్ 2వీకి (OnePlus Ace 2V) సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి.
OnePlus Ace 2V:మిడ్ సెగ్మెంట్‌పై వన్ ప్లస్ (OnePlus) కంపెనీ దృష్టిసారించింది. రూ.30 వేల లోపు మొబైల్స్ సేల్స్ ఎక్కువ ఉంటున్నందన.. ఆ ధరలో కొత్త ఫీచర్లతో (Features) తీసుకొస్తోంది. తాజాగా వన్ ప్లస్ ఏస్ 2వీకి (OnePlus Ace 2V) సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి. ఈ మొబైల్‌ను చైనాలో (china) రిలీజ్ చేశారు. ఇండియాలో (india) జూలైలో అందుబాటులోకి రానుంది. ధర రూ.27 వేల వరకు ధర ఉండొచ్చు.
6.74 అమోలెడ్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. స్క్రీన్ రేషియో 93.50గా ఉండనుంది. గోరిల్లా గ్లాస్ 5 (gorilla glass 5) ఇవ్వడంతో స్క్రీన్ మంచి ప్రొటెక్షన్ ఉండనుంది. అండ్రాయిడ్ 13 సాప్ట్ వేర్ మీద మొబైల్ రన్ అవుతుంది. త్రిపుల్ కెమెరాతో (triple camera) మొబైల్ వస్తోంది. మెయిన్ కెమెరా 64 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ ఇచ్చారు. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా ఉంది. వీటికి ఎల్ఈడీ ప్లాష్ లైట్ ఉంటుంది. సెల్పీ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
లీ పాలీమర్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ (battery) ఇచ్చారు. 80 వాట్స్ చార్జర్ సాకెట్‌తో 32 నిమిషాల్లోనే జీరో నుంచి 100 శాతం ఛార్జీంగ్ అవుతుంది. మొబైల్ 12 జీబీ ర్యామ్, స్టోరెజ్ సామర్థ్యం 256 జీబీ ధర రూ.27 వేలు ఉండగా.. 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరెజ్ ఉన్న మొబైల్ ధర రూ.29 వేలు ఉంటుంది. అలాగే 16 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరెడ్ గల మొబైల్ ధర రూ.33 వేలు ఉంటుంది. ఈ మొబైల్స్ డ్యుయల్ 5జీ సిమ్ (5g sims) వర్క్ అవుతాయి.
నార్డ్ సిరీస్‌తో (nord series) వన్ ప్లస్ మధ్య తరగతి వారికి అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో రూ.20 వేల లోపు మొబైల్స్ తీసుకురావడంతో.. వాటి సేల్స్ పెరిగాయి. ప్రీమియం ఫోన్లను రిలీజ్ చేస్తూనే.. మిడ్ సెగ్మెంట్‌పై ఫోకస్ చేసింది.