Telangana Government To Look Forward To The Selection Of Beneficiaries Of Rs.500 Gas Connection
Gas cylinder: చమురు సంస్థలు గ్యాస్ వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(Oil Marketing Companies) మంగళవారం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల(Commercial LPG cylinders) ధరలను పెంచాయి. డొమెస్టిక్ సిలిండర్(Domestic LPG cylinders) ధరల విషయంలో మార్పులు చేయలేదు కానీ వ్యాపార సంస్థలు వినియోగించే సిలిండర్ రేట్లను పెంచింది. ఒక్కో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.7 చొప్పున పెంచారు.
జూన్ నెలలో ధరలను కాస్త తగ్గించిన తర్వాత మళ్లీ ఇప్పుడు ధరలను పెంచాయి. చమురు సంస్థల తాజా నిర్ణయంతో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో 1773 రూపాయల నుంచి 1780 రూపాయలకు పెరిగింది. కలకత్తాలో 1902 రూపాయలు, ముంబైలో 1740 రూపాయలు, చెన్నైలో 1952 రూపాయలు గానూ ఉంది. జూన్ నెలలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.83.50 తగ్గింది.
ఓ వైపు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్(Commercial LPG cylinders) ధర గత కొన్ని నెలలుగా పెరుగుతూ, తగ్గుతూ ఉండగా, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్(Domestic LPG cylinders) ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉంటున్నాయి. చివరిసారి మార్చి 1, 2023న రూ.50 పెరిగింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీ(Delhi)లో రూ.1,103గా ఉంది. సహజంగా ఎల్పీజీ సిలిండర్ల రేట్లు ప్రతి నెల మొదటి రోజున సవరించబడతాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలో LPG సిలిండర్ల ధరలు తగ్గిన తర్వాత జులైలో ప్రస్తుతం ధరలు పెరిగాయి.