దేశీయ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈ ఉదయం 79,653 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు కొనసాగించింది. ఒక దశలో 1100 పాయింట్లకు పైగా లాభపడి 80,539.81 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మొత్తంగా మార్కెట్ ముగిసే సమయానికి 602.75 పాయింట్లు ఎగబాకి 80,005.04 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 24,134 – 24,492 మధ్య కదలాడి చివరకు 158.35 పాయింట్ల లాభంతో 24,339.15 వద్ద స్థిరపడింది.