మనం నిత్యం ఉపయోగించే నోట్లను ముద్రించేందుకు ఖర్చు ఎంత చేస్తున్నారనేది RBI వెల్లడించింది. రూ.10 నోటు తయారీకి రూ.0.96 ఖర్చవుతుంది. అలాగే, రూ.20 నోటుకు రూ.0.95, రూ.50 నోటుకు రూ.1.13, రూ.100 నోటుకు రూ.1.77, రూ.200 నోటుకు రూ.2.37. అదేవిధంగా రూ.500 నోటుకు రూ.2.29 ఖర్చవుతుంది. రూ.200 నోటు తయారీకి రూ.500 నోటు తయారీ కంటే ఖర్చు ఎక్కువ కావడం గమనార్హం.
Tags :