NLG: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బీబీనగర్ రైల్వే స్టేషన్లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. యువకుడు బీబీనగర్ ఇందిరమ్మ కాలనీకి చెందిన ఎరుకల మహేష్ స్థానికులు గుర్తించారు. దీంతో మహేశ్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు.