MDCL: మురికి కుంటలో పడి ఓమహిళ మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మండలంలోని కండ్లకోయ గ్రామంలో సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ సమీపంలోని మురికికుంటలో యాదమ్మ(45)అనే మహిళ పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. యాదమ్మ వృత్తిరీత్యా రోడ్లపై ప్లాస్టిక్ బాటిల్ సేకరణ చేస్తూ జీవనం సాగించేదని పోలీసులు తెలిపారు.