పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరానికి సమీపంలోని పోలీస్ అవుట్పోస్టుపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది పోలీసులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని ‘తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్’ గ్రూప్ ప్రకటించింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు అవుట్పోస్టులోకి చొరబడి బోర్డర్ కాస్టబులరీ సెక్యూరిటీ ఫోర్స్ సభ్యులను హతమార్చినట్లు సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు.