సత్యసాయి: ధర్మవరం మండల పరిధిలోని ఎలుకుంట్ల గ్రామంలో దామోదర్(40) అనే రైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడి చనిపోయాడు. శుక్రవారం తన పొలంలో ట్రాక్టర్‌తో వ్యవసాయం చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడటంతో అక్కడికక్కడే చనిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. దామోదర్ చనిపోయిన విషయం తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.