కృష్ణా: మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పత్తిపాటి దాసు(51) మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని విశేషంగా కృషి చేసిన దాసు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా పలువురు నేతలు పేర్కొన్నారు.