చిత్తూరు మెకానికల్ గ్రౌండ్ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ పైన వ్యక్తి మృతి చెందాడు. తిరుపతిలోని ఓ కంపెనీకి చెందిన థెరపీ మేనేజర్ తేజేశ్వర్ రెడ్డి రైలు కింద పడి మృతి చెందాడు. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రైలు కింద పడ్డాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.