KKD: సామర్లకోటలోని గాంధీనగర్లో గండేపల్లి సాయికృష్ణ (20) అనే యువకుడు ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ వేయించుకోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, బోరున విలపిస్తున్నారు.