కృష్ణ: గన్నవరం మండలం కేసరపల్లి చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేసరపల్లికి చెందిన రైతు రామారావు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.