KDP: రైల్వే కోడూరు కే. బుడుగుంట పల్లికి చెందిన ఎట్టి వెంకటేష్(24) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు విపరీతంగా కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రైల్వే కోడూరు ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రికి తరలించారు.